తెలంగాణలో బీసీ బిడ్డను సీఎం చేస్తాం: తీన్మార్ మల్లన్న
కొత్తకోట : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు రాజకీయ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 21వ రోజుకు చేరుకుంది. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటకు చేరుకున్న మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొత్తకోట సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. బీసీల ఓట్లతో గెలిచి.. బీసీలపైనే రాజకీయ పెత్తనం చేయడం ఇక సాగదని వ్యాఖ్యానించారు. దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 2,35,352 ఓట్లలో బీసీల ఓట్లు 1,47,247 ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. రెడ్డి సామాజికవర్గానికి 11,206 ఓట్లు మాత్రమే ఉన్నాయని...