మోకుదెబ్బలో 15 పల్లె గౌడ కుటుంబాల చేరిక

నిజామాబాద్‌: ఆర్మూర్‌ మండలం పల్లె గ్రామపంచాయతీకి చెందిన 15 గౌడ కుటుంబాలు నిజామాబాద్‌ జిల్లా గౌడ సంఘానికి రాజీనామా చేసి గౌడ జన హక్కుల పోరాట సమితి ‘మోకుదెబ్బ’లో చేరినట్లు జిల్లా అధ్యక్షుడు కోటగిరి అరుణ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద గీత కార్మిక కుటుంబాలకు మోకుదెబ్బ అండగా ఉంటుందని అన్నారు. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో 39 గీత కార్మిక, 11 దళిత కుటుంబాలపై సామాజిక బహిష్కరణకు పాల్పడటం అన్యాయమని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. పేద గౌడ కుటుంబాలను వృత్తిపరంగా, సామాజికంగా వేధిస్తే సహించబోమని, సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా...