ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి

వరంగల్‌: వరంగల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రజాసేవకు పదవులతో సంబంధం లేదని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పట్ల సేవా దృక్పథంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారని బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. వన్నాల వెంకటరమణ తెలిపారు. ‘నాగరిక్‌ దేవో భవ’ స్ఫూర్తితో ప్రజలను కేంద్రంగా చేసుకుని పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం వరంగల్‌ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్‌ వరకు కాగడాలతో సేవా యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి,...