అనారోగ్యంతో బాధపడుతున్న సదానందంకు అరూరి రమేష్ పరామర్శ
వర్ధన్నపేట : పట్టణంలోని హోటల్ ముంజ సదానందం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆయనను పరామర్శించారు. సదానందం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.