నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్‌.. ముఠా అరెస్ట్‌

సికింద్రాబాద్‌: నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 1982 నాటి పత్రాలను సైతం సృష్టించి నకిలీ జీపీఏలు, వివిధ రకాల సేల్‌డీడ్‌లు తయారు చేసినట్లు గుర్తించారు. అమెరికాలో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి వారి ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఎల్‌బీనగర్‌లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టాంప్‌ పేపర్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలతో 8 చోట్ల మార్టిగేజ్‌ ప్రాపర్టీలను విడుదల చేసినట్లు గుర్తించారు. ప్రాపర్టీల నకిలీ దందాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని సీపీ సుమతి హెచ్చరించారు.