క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం
వర్ధన్నపేట: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. తొలి మ్యాచ్లో కేశవపురం, ఎన్ఎస్ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు....