శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం

తిరుమల : శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. 2026లో తొలి తొమ్మిది నెలల్లో హుండీ ద్వారా ఏకంగా రూ.1,129.04 కోట్ల ఆదాయం సమకూరింది. జూలైలో అత్యధికంగా రూ.140.25 కోట్లు లభించగా, ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.126.41 కోట్లు వచ్చాయి. జూన్‌లో రూ.128.30 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక సెప్టెంబర్‌ 10న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.6.94 కోట్ల కానుకలు రావడం విశేషం. తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.