చైర్మన్‌ కుమారుడిపై ఆరోపణలు.. రెండో రోజూ దళిత యువతి పోరాటం

నాలుగేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తగానే నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ దళిత యువతి చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగింది. వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌పై యువతి ఈ ఆరోపణలు చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తూ మంగళవారం కూడా చైర్మన్‌ ఇంటి ఎదుట దీక్ష కొనసాగించింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా శ్రీకాంత్‌, తాను ప్రేమించుకుంటున్నామని, పెళ్లి విషయంలో ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొంది. వారం రోజుల క్రితం హనుమకొండలో శ్రీకాంత్‌ తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ సుబేదారి...