అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి... కల్వకుంట్ల కవిత
చందుర్తి : అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి మనం ఇచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన **‘అమరుల యాది’** కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సబ్బండ వర్గాలు, అన్ని కులాలకు అధికారంలో సముచిత భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన ఫలితం లభిస్తుందని పేర్కొన్నారు. సమాజం కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో తనకు తెలుసని కవిత అన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిమ్స్‌లో 11 రోజుల పాటు నిరాహార...