337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

మహబూబాబాద్ జిల్లాలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదుపై కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. FRS (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) ద్వారా హాజరు నమోదు చేయని 337 మంది ఉపాధ్యాయులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. FRSలో హాజరు నమోదు చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ సంబంధిత MEOలు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా FRS విధానం ద్వారా హాజరు నమోదు చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల విద్యాబోధనపై హాజరు నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్న కలెక్టర్.....