ఆయిల్‌ఫామ్ రైతుల మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు ఏకగ్రీవం రైతుల సమస్యల పరిష్కారమే కమిటీ ప్రధాన లక్ష్యం
వర్ధన్నపేట, అక్టోబర్ 6: ఆయిల్‌ఫామ్ సాగును మరింత విస్తరించి, రైతులకు మెరుగైన దిగుబడులు, ఆదాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆయిల్‌ఫామ్ రైతుల మండల కమిటీ నూతన సభ్యులు పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని రైతు వేదికలో ఆయిల్‌ఫామ్ రైతుల మండల కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఆయిల్‌ఫామ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు సమావేశంలో ఆయిల్‌ఫామ్ సాగులో రైతులు పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులపై ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. మొక్కల ఎదుగుదలకు అవసరమైన జాగ్రత్తలు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల...