19 ఏళ్ల బొగ్గు కోసం 800 ఏళ్ల రామప్పను పణంగా పెడతారా..? మాజీ ఎంపీ వినోద్‌కుమార్
ములుగు : వెంకటాపూర్ వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీఎన్‌ఆర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇది కేవలం మైనింగ్ ప్రాజెక్టు సమస్య కాదని.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువు, కాకతీయుల ప్రాచీన సాగునీటి వ్యవస్థ, పరిసర గ్రామాల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నివేదిక ప్రకారం ప్రతిపాదిత గని సుమారు 300 మీటర్ల లోతు వరకు ఉండి, రామప్ప ఆలయం–చెరువుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు,...