ఢిల్లీలో ఉద్రిక్తత.. విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీ చేపట్టారు. మకర్‌ ద్వార్‌ నుంచి బయలుదేరిన ర్యాలీని ఆకాశవాణి భవన్‌–పార్లమెంట్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితర విపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, SIRపై అభ్యంతరాలను పరిశీలించాలని వారు డిమాండ్‌ చేశారు. భారీగా పోలీసు బలగాలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం...