ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు

హనుమకొండ: తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సోమవారం హనుమకొండ బస్టాండ్‌, డిపో-2లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులను కలిసి వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం పనిచేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కార్మికుల ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ఆర్టీసీ నేతలు, కార్మిక