పెబ్బేరు వేదికగా రాజ్యాధికార పార్టీలో చేరికలు

పెబ్బేరు: షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మీదికేరి రాధాకృష్ణ, అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప్పర మోనీ రాములు ముదిరాజ్‌, బీఎస్పీకి చెందిన గుండ్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, గుల్ల హరిప్రసాద్‌, గడీల అంజయ్య తదితరులకు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కండువాలు కప్పి ఆహ్వానించారు. బీసీల రాజకీయ హక్కులు, రాజ్యాధికార లక్ష్యంగా సాగుతున్న ఉద్యమానికి పలువురు నాయకులు మద్దతు ప్రకటించారు.