నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై ఇంధన సర్‌చార్జి భారం పెరగనుంది. నేటి నుంచి దేశీయ విమాన టికెట్లపై రూ.100–350 వరకు అదనపు సర్‌చార్జి వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ విమానాలకు దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు సర్‌చార్జి పెరుగుతుంది. 500 కి.మీ. వరకు రూ.375, 501–1000 కి.మీ.కు రూ.600, 1001–1500 కి.మీ.కు రూ.900, 1501–2000 కి.మీ.కు రూ.1,150, 2,000 కి.మీ.కు పైగా రూ.1,300 చొప్పున వసూలు చేయనున్నారు.