చదివింది ఉద్యోగం కోసం.. దిగజారింది కాసుల కోసం!

హైదరాబాద్‌: కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకున్న ఇద్దరు మహిళా అధికారులు అవినీతి ఆరోపణలతో ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వర్ణకుమారి.. మూతపడిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు లంచం డిమాండ్‌ చేసిన కేసులో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, డ్రైవర్‌తో కలిసి పట్టుబడ్డారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ తులసీరామ్‌ సునీత.. భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనపై అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.8 లక్షలు డిమాండ్‌ చేసి, రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఉన్నతస్థాయిలో ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలతో పట్టుబడటం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది.