ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ మీటర్లు

వర్ధన్నపేట : మండలంలోని ఇల్లందలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు ఉచిత మీటర్లపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. వరంగల్‌ రూరల్‌ డీఈ దానయ్య ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయ ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు, పెండింగ్‌ లైన్ల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్‌ బేతి సాంబయ్య కోరారు.