సినీ హీరోయిన్ నేహా శెట్టి సందడి
హనుమకొండ నగరంలో సినీ హీరోయిన్ నేహా శెట్టి సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ షాప్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి రాకతో అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడంతో షాప్ పరిసరాలు సందడిగా మారాయి. హనుమకొండకు రావడం ఇది రెండోసారి అని నేహా శెట్టి తెలిపారు.