మెడికవర్‌లో వరుస మరణాల కలకలం..!

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో వరుస మరణాలపై పలు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్‌ 22న అక్తా తునిసా, జి.అరుణదేవి, చంద్రకళ, దుంపాల మాణిక్యమ్మ, కృష్ణ జంగయ్య, జి.మేరీ ఫాతిమా, అల్లాచెరువు వెంకటగిరి ప్రసాద్‌ సహా ఏడుగురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. రెండు రోజుల్లో 15 మంది మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికిత్స పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ, అధికారుల దర్యాప్తు వివరాలు వెలువడాల్సి ఉంది.