మద్యపానంలో తెలంగాణ టాప్..!
తెలంగాణలో మద్యపానంపై NFHS-6 సర్వే నివేదిక కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది జాతీయ సగటు 18.9 శాతంతో పోలిస్తే రెట్టింపుకుపైగా ఉంది. పట్టణాల్లో 36.3 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 46.6 శాతంగా నమోదైనట్లు తెలిపింది. రాజస్థాన్ 42.2 శాతం, ఛత్తీస్గఢ్ 38.3 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం.