విజయవాడలో దారుణం.. ప్రియురాలిపై కొడవలితో దాడి!
విజయవాడ : న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో మహాలక్ష్మిపై చిన్నారావు కొడవలితో దాడి చేసినట్లు సమాచారం. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అనంతరం చిన్నారావు భవనం పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.