కోర్టు తీర్పుతో మనస్తాపం.. కూతురిని కాల్చి చంపి తల్లి ఆత్మహత్య

హ్యూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చైల్డ్‌ కస్టడీ వివాదంలో కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఓ తల్లి తన కుమార్తెను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తీర్పులో కుమార్తె వివియన్‌ ప్రాథమిక కస్టడీని తండ్రి ఆరోన్‌ సెవెల్లాకు అప్పగించి, తల్లికి పర్యవేక్షణలో మాత్రమే కుమార్తెను కలిసే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సిబెల్లా సెవెల్లా (35) ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.