కేటీఆర్ ఆదేశంతో కార్యకర్తకు పరామర్శ

హన్మకొండ: కాజీపేట మండలం మడికొండ అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్త మూల నాగరాజువర్మను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పరామర్శించారు. నాగరాజువర్మ అనారోగ్య పరిస్థితిని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు వినయ్‌భాస్కర్‌ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.