రిజర్వాయర్‌లో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

జనగామ: నర్మెట్ట మండలం మల్లన్నగండి రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పడాల కళ్యాణ్‌కుమార్ (27) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి వరంగల్‌లోని దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించిన అనంతరం రిజర్వాయర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.