జర్మనీ నుంచి తిరిగొచ్చిన యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్:మానసిక ఒత్తిడికి గురైన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన యువకుడు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లికుదురుకు చెందిన ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ వీరగాని మల్లేషం కుమారుడు విద్యాసాగర్‌ (29) ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగం చేస్తున్న ఆయన వీసా, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యోగం కోసం గత జూలైలో జర్మనీకి వెళ్లిన విద్యాసాగర్‌కు అక్కడ సరైన అవకాశం లభించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు వారు చెప్పారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో తండ్రికి ఫోన్‌ చేసి టికెట్‌ డబ్బులు పంపించాలని కోరాడు. అనంతరం నగరానికి తిరిగి...