ప్రతి గ్రాడ్యుయేట్ బాధ్యతగా ఓటును నమోదు చేసుకోవాలి..

జఫర్గడ్: అక్టోబర్ 3 (తెలంగాణ గొంతుక) వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన నమోదు ప్రక్రియను ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య సూచనల మేరకు జాఫర్ గడ్ మండల కేంద్రంలోని బాలాజీ ఇంటర్నెట్ సెంటర్ వద్ద ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల పట్టభద్రుల...