వికారాబాద్లో ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి నుంచి తాండూర్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడి అనంతగిరి కొండల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.