పాక్‌పై పంచ్.. భారత్‌కు గోల్డ్! 19 పరుగులతో ఘన విజయం.. వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం
నిస్సిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ వరుసగా రెండో ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. అభిషేక్.. తిలక్ విధ్వంసం... భారత్ భారీ స్కోరుకు ఓపెనర్ అభిషేక్ శర్మ పునాది వేశాడు. కేవలం 28 బంతుల్లో 61 పరుగులు చేసిన అతడు 3 ఫోర్లు, 7...