స్పెయిన్‌కు చేరిన ఐఎన్‌ఎస్ త్రిశూల్
న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ త్రిశూల్ స్పెయిన్‌లోని వాలెన్సియా నౌకాశ్రయానికి చేరుకుంది. మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ ప్రాంతాల్లో కొనసాగుతున్న భారత నౌకాదళ మోహరింపులో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విదేశీ నౌకాదళాలతో పరస్పర సహకారం, సముద్ర భద్రత, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ మోహరింపు ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. వాలెన్సియాలో ఐఎన్‌ఎస్ త్రిశూల్‌కు స్పెయిన్ నౌకాదళ అధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది మధ్య వృత్తిపరమైన పరస్పర చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే సముద్ర కార్యకలాపాలు, నౌకాదళ సామర్థ్యాలపై పరస్పర...