తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులకు 24–30 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3–5 గంటలు, టోకెన్ పొందిన వారికి 5–7 గంటల సమయం పడుతోంది. నిన్న 78,445 మంది స్వామివారిని దర్శించుకోగా, 40,098 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు, 4.16 లక్షల లడ్డూల విక్రయం జరిగింది. 3.30 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.