మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీలో సంచలన విషయాలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూశాయి. పది రోజుల పోలీస్‌ కస్టడీలో నిందితుడు మల్లేష్‌ ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్‌కు ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 2025లో చోరీకి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. 2026 జూలైలో రెజిమెంట్‌ పరిసరాల్లో రెక్కీ నిర్వహించి, మరికొందరి సహకారంతో చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్‌లోని ఇంట్లో దాచినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కలకత్తాకు చెందిన అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీకి విక్రయించేందుకు బీర్బల్‌ షా ద్వారా...