పీఎం మెమెంటోస్ వేలం గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్రం ఈనెల 31 వరకు పొడిగించింది. వేలంలో 30 రకాల కానుకలు, జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాకతీయ కళాతోరణం వెండి నమూనాకు రూ.10 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు. అత్యధికంగా జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నారు.