ఆటోడ్రైవర్ దారుణం.. మహిళను గోదావరిలోకి తోసేశాడు
తాళ్లపూడి: ఒంటరిగా ఆటో ఎక్కిన మహిళను డ్రైవర్ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి బంగారు ఆభరణాలు లాక్కొని నదిలోకి తోసేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమకు చెందిన ఆదిలక్ష్మి(36) తాళ్లపూడిలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి పని ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరిన ఆమె ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆటోడ్రైవర్ షేక్ యాకబ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలం మేరకు గోదావరిలో ఆదిలక్ష్మి కోసం గాలింపు చేపట్టారు.