హాలీవుడ్‌లో ఏఐ సినిమాల హవా
అంతర్జాతీయం: కజకిస్థాన్‌లో జరుగుతున్న అస్తానా ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్–2026తో సినిమా రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 125 దేశాల నుంచి 8,000కుపైగా దరఖాస్తులు రావడం విశేషం. వీటిలో 25 చిత్రాలను తుది దశకు ఎంపిక చేశారు. సినిమా నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్, కథ చెప్పే విధానంలో ఏఐ వినియోగం భవిష్యత్తులో ఎలా మార్పులు తీసుకురానుందనే అంశంపై ఫెస్టివల్‌లో చర్చలు జరుగుతున్నాయి.