చమురు ధరలకు కళ్లెం.. 10 కోట్ల బ్యారెళ్ల విడుదల

అంతర్జాతీయం: పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాబోయే నెలల్లో సుమారు 100 మిలియన్‌ బ్యారెళ్ల చమురు, శుద్ధి చేసిన ఇంధనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. డీజిల్‌ నిల్వలను ముందుగా విడుదల చేయనున్నారు. ఇరాన్‌ యుద్ధం, సరఫరా మార్గాల్లో అంతరాయాలతో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు జీ7 దేశాలు తెలిపాయి.