హైదరాబాద్‌లో రూ.52 వేల కోట్ల పనులు

హైదరాబాద్‌: నగరంలో ప్రస్తుతం రూ.52 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మెట్రో ఫేజ్‌–2, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రేడియల్‌ రోడ్లు, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్‌ సిటీ వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా రవాణాను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సాంకేతికతతో అనుసంధానం చేసే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు