హైదరాబాద్‌లో ఒకే పాస్‌.. బస్సు, మెట్రోకు!

హైదరాబాద్‌: నగర ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ సిటీ బస్సులు, హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించేందుకు ఒకే కామన్‌ పాస్‌ విధానం ప్రారంభమైంది. అక్టోబర్‌ 3 నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో ఈ పాస్‌ లభిస్తుంది. వన్‌డే పాస్‌ ధర రూ.400, 30 రోజుల పాస్‌ ధర రూ.8,500గా నిర్ణయించారు. పుష్పక్‌ బస్సులకు మాత్రం ఈ పాస్‌ వర్తించదు. ‘మీటికెట్‌’ యాప్‌ ద్వారా డిజిటల్‌ టికెట్లు, పాస్‌లను కూడా పొందవచ్చు.