అక్టోబర్‌ 2 సీమ చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

అన్నమయ్య జిల్లా: 2026 అక్టోబర్‌ 2 రాయలసీమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా నేడు కీలక అడుగు పడిందన్నారు. కరవు సీమను సిరుల సీమగా, రాయలసీమను ప్రపంచానికి ‘ఫ్రూట్‌ బౌల్‌’గా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు. నేడు వేసిన అడుగు సీమ రైతుల తలరాతను మార్చే దిశగా ఉంటుందని అన్నారు. హార్టికల్చర్‌ హబ్‌ ద్వారా ఉద్యాన పంటల సాగు, ప్రాసెసింగ్‌, కోల్డ్‌చైన్‌, మార్కెటింగ్‌, ఎగుమతులకు ప్రాధాన్యం కల్పించి రైతులకు మరిన్ని అవకాశాలు...