హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు ఎస్పీ అభినందనలు
బాపట్ల: చెరుకుపల్లి మండలం కనగాల సమీపంలోని జాతీయ రహదారిపై హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనదారులను బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ అభినందించారు. రేపల్లె పర్యటన బందోబస్తు ముగించుకుని బాపట్లకు తిరిగి వస్తున్న సమయంలో ఒకే బైక్పై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉండటాన్ని గమనించిన ఎస్పీ తన వాహనాన్ని నిలిపి వారిని స్వయంగా అభినందించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ‘శిరోరక్ష.. ప్రాణరక్ష’ కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో ఊహించలేమని, తలకు గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి...