13 శాతం లోటుతో ముగిసిన నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ: 2026 నైరుతి రుతుపవనాల సీజన్‌ అధికారికంగా ముగిసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో దేశ సగటు వర్షపాతం 759.4 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, సాధారణ దీర్ఘకాల సగటు 868.6 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ఏడాది రుతుపవనాలపై ముందుగానే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మేలో ఐఎండీ 2026 రుతుపవన కాలంలో దేశవ్యాప్తంగా సాధారణ దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, సీజన్‌ సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది....