డాలర్‌కు 17 నెలల గరిష్ఠం

అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్‌ విలువ 17 నెలల గరిష్ఠానికి చేరింది. ప్రపంచ బాండ్‌ మార్కెట్లలో ఒత్తిడి, ఇంధన ధరల పెరుగుదల, ఫ్రాన్స్‌ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు దీనికి ప్రధాన కారణాలుగా మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. యూరో విలువ 2025 మే తర్వాత కనిష్ఠ స్థాయికి చేరువైంది. ఇదే సమయంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది.