నకిలీ సర్టిఫికెట్ల తయారీ.. నలుగురు అరెస్ట్

మహబూబాబాద్:బయ్యారం మండలంలో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం వెలుగుచూసింది. ఎంపీవో కార్యాలయ డేటాసోర్సింగ్ ఉద్యోగి, మీసేవ కేంద్ర నిర్వాహకుడు మరో ఇద్దరితో కలిసి 275 బర్త్, 19 డెత్ సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటిని బీమా క్లెయిమ్‌ల కోసం వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రశాంత్‌బాబు తెలిపారు.