జ్వరంతో గర్భిణి మృతి

హన్మకొండ:నడికూడ మండలంలోని కంఠాత్మకూరులో జ్వరంతో ఓ గర్భిణి మృతి చెందింది. గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు భార్య గౌరి (24) ఆరు నెలల గర్భిణి. జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమార్తె ఉంది.