అక్టోబర్‌ 2.. జాతిపితను స్మరించుకునే రోజు

హైదరాబాద్ : అక్టోబర్ 2 భారత చరిత్రలో ప్రత్యేకమైన రోజు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తారు. అహింస, సత్యాగ్రహం, సత్యం వంటి సిద్ధాంతాలతో స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారు. సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలకు ఆయన జీవితం ప్రతీకగా నిలిచింది. గాంధీ జయంతిని ఏటా జాతీయ పండుగగా నిర్వహిస్తూ ఆయన ఆశయాలను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.