చిన్నారి తరిణి పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఎర్రబెల్లి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుమారుడు నిఖిల్–అనీల దంపతుల కుమార్తె తరిణి తొలి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లోని ఎన్విరాన్ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారి తరిణిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.