మాజీ సర్పంచ్ మంద బాబురావు మృతి

వరంగల్: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పోతురాజుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మంద బాబురావు గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. అరుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ సందర్శించి నివాళులర్పించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు కమల్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎలగొండ ప్రవీణ్, గోదాసి చిన్న తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. బాబురావుకు సంబంధించిన రూ.20 వేలకు పైగా ఆస్పత్రి బిల్లును ఎండీ అయూబ్ చెల్లించి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసినట్లు తెలిపారు.