ఏనుగు దంతాల అక్రమ విక్రయం గుట్టురట్టు
హైదరాబాద్: నగరంలో ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి సంబంధించిన గుట్టును డీఆర్ఐ అధికారులు రట్టు చేశారు. అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన నాలుగు ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 17 కిలోలు ఉన్నట్లు సమాచారం. దంతాలతో తయారు చేసిన పలు ఐవరీ వస్తువులు, ట్రోఫీలను కూడా సీజ్ చేశారు. ఏనుగు దంతాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వీటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.