తెలంగాణ భవన్‌ ఎదుట దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకుల పేరుతో దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరారని ఫ్లెక్సీల్లో ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదంటూ అందులో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.