ఓయూలో గంజాయి మొక్కల కలకలం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో గంజాయి మొక్కలు కనిపించడం కలకలం రేపింది. వర్సిటీ ఆవరణలో మొక్కలను గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యా సంస్థలో గంజాయి మొక్కలు పెరగడంపై విద్యార్థులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు అక్కడికి ఎలా వచ్చాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.